Pre-Shatavahana Era in Telugu-శాతవాహన పూర్వ యుగం


     
    Pre Shatavahana Era in Telugu

    Pre-Shatavahana Era in Telugu

    శాతవాహన పూర్వ యుగం

     

    Ø         గతాన్ని సాహిత్యం ద్వార అద్యయనం చేసే సాహిత్య విభాగాన్ని చరిత్ర అంటారు.

    Ø      గతాన్ని వస్తు అవశేషాల ద్వార అద్యయనం చేసే శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు.

    Ø       ప్రాచిన కాలపు చరిత్రను గురుంచి తెలియ జేయు ఆధారాలు ముఖ్యంగా రెండు రకాలు :

    1.సాహిత్య ఆధారాలు :

    ➤ వివిధ కాలాలలో వివిధ కవులు రచించిన రచనలు ఆ కాలు రాజుల జీవిత విశేషాలను,అప్పటి సామజిక పరిస్తితులను,పరిపాలనను తెలియజేస్తాయి.

    2.పురావస్తు ఆధారాలు :

    ➤ పురావస్తు ఆధారాలలో ముఖ్యమైనవి: శాసనాలు,నాణేలు,కట్టడాలు,చిత్రాలు,శిల్పాలు.

    ➤ గట్టి ఉపరితలం పై లిపిని తెలియ జేయునది శాసనం.  పురావస్తు శకలో శాసనాలను అద్యయనం చేయు శాఖను ఎపిగ్రాఫి(Epigraphy) అంటారు.

    ➤ పురావస్తు శాఖలో నాణేలను అద్యయనం చేయు శాఖను న్యుమిస్ మాటిక్స్ (Numismatics) అంటారు.

    ➤ శాసనాలు,నాణేలు కూడా అప్పటి రాజుల విజయాలు,పరిపాలనను తెలియజేస్తాయి.

    ➤ తెలంగాణా  చరిత్రకు సంబంధించిన మొట్టమొదటి శిలాశాసనాలు,నాణేలు జగిత్యాల జిల్లా వేగాల్తురు మండలం కోటి లింగాల లో దొరికాయి.

    కోటిలింగాలలో దొరికిన నాణేలపై ఉన్న రాజుల పేర్లు గొబాద్,సిరి కంవాయ,సిరి వాయు,సిరినారాన,సమగోప.

    Emergence of the word Telangana 

    తెలంగాణా పద ఆవిర్భావం:

    ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం,తెలుగు వారు నివసించిన ప్రాంతం త్రిలింగ దేశంగా వ్యవహరించబడింది. 

    ➤ తెలంగాణా లోని జీవనది గోదావరి నదిని పూర్వం తెలివాహ నది గా వ్యవహరించేవారు.

    ➤ తెలివాహ నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులు గా వ్యవహరించి,కాలక్రమంలో త్రిలింగ దేశం గాను తెలంగాణా గాను స్థిరపడి ఉండవచ్చు. 

    ➤ గాంగ వంశస్తుడైన ఇంద్రవర్మ వేయించిన పుర్లి శాసనం నుంచి మొదలుకొని,త్రిలింగ,తిలింగ,తెలంగ అనే మూడు పాదాలను పర్యాయ పదాలుగా వాడడం జరింగింది.

    ➤ తెలంగాణ పదాన్ని సార్ధకం చేసి,స్త్రిర పరిచిన ఘనత కాకతియనంతర రచయితలకు దక్కుతుంది.

    పి.శ్రీరామశర్మ అభిపరం ప్రకారం,అమీర్ ఖుస్రో నుంచి అబుల్ ఫజాల్ మద్య కాలంలో అంటే స్థూలంగా అల్లాఉద్దిన్ ఖిల్జీ నుంచి అక్బర్ కాలం మద్యలో తెలంగాణ అనే పేరు వ్యావహారికంగా మారింది.

    తెలంగాణ అనే పదం గల శాసనాలు 

    1. సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ శాసనం (క్రీ.శ.1417) లో తెలంగాణా పురం అనే అంశం ప్రస్తావన ఉంది.

    2. ప్రతాప రుద్రా గజపతి యొక్క వెలిచెర్ల శాసనం.(క్రీ.శ.1510).

    3. శ్రీకృష్ణదేవరాయల తిరుమల,చిన్నకంచి శాసనాలు.

    ➤ కాకతీయుల కాలంలో కొన్ని శాఖల బ్రాహ్మణులను తెలగాణ్యులు అనే పేరుతో పిలిచేవారు.తెలగాణ్యులు అనగా తెలంగాణకు చెందినా వారుగా ప్రస్తావించారు.

    అణేము అనగా దేశము కాబట్టి గోల్కొండ స్థాపన సమయంలో కూడా తెలంగాణ వాడకం ప్రాచుర్యం చెందినదని సురవరం ప్రతాప రెడ్డి గారు పేర్కొన్నారు. 

    మనకు లభిస్తున్న ఆధారాల ప్రకారం చరిత్రను ౩ విధాలుగా విభజించవచ్చు.

    1.Pre Historic Period (చరిత్ర పూర్వ యుగం): 

      ➤ చరిత్ర రచనకు సంభందించిన లిఖిత పూర్వక ఆధారాలు లభించని కాలం.

    2     2.Proto Historic Period (పురా/సందియుగ చరిత్ర): 

      ➤  చరిత్ర రచనకు లిఖిత పూర్వక ఆధారాలు లభిస్తాయి.కానీ దాని లిపిని తెలుసుకోలేని కాలాన్ని సంధియుగ చరిత్ర అంటారు.

       3.Historic Period (చారిత్రక యుగం): 

      ➤ చరిత్ర రచనకు సంభందించిన లిఖిత పూర్వక ఆధారాలు లభిస్తున్న కాలం.

    చరిత్ర పూర్వ యుగం 

      ➤ తెలంగాణ చరిత్ర పూర్వయుగపు అధ్యయనానికి తెరతిసినది-రాబర్ట్ బ్రూస్ఫూట్ 19 శతాబ్దానికి మద్య కాలంలో నల్లగొండ జిల్లాలోని వలిగొండ(ప్రస్తుత యదాద్రి జిల్లా)లో బృహత్ శీలాయుగపు సమాధులు.

    ➤ 1914 లో ఏర్పాటైన హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ శాస్త్రీయంగా చరిత్ర పుర్వయుగపు స్థలాలను గుర్తించింది.

    ➤ హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ 1953 లో యంతిక్వేరియన్ రెమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే పుష్టకాన్ని ప్రచురించింది.ఈ పుష్టకంలో తెలంగాణా చరిత్ర పుర్వయుగానికి సంభందించి,118 స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొంది.

        నోట్: సాల్వేజ్ ఆర్కియాలజీ అనగా ముంపు సంరక్షణ పురావస్తు తవ్వకాల అధ్యయనం.


        ➤ పురావస్తు సంచాలకులుగా పని చేసిన వి.వి.కృష్ణమూర్తి తెలంగాణాలోని అనేక చరిత్ర పూర్వ యుగపు సమాధులను,ప్రత్యేకించి చిత్ర లేఖనలున్న స్థలాలను గుర్తించారు.

         తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైలం పీఠంలో ఆచార్యులుగా పనిచేసిన కే.తిమ్మారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పారే కృష్ణా నది ఒడ్డున ఉన్న చారిత్రక స్థలాలను వెలుగులోకి తెచ్చారు. 

        ➤ ఉత్తర తెలంగాణలోని గోదావరి లోయలో బాసర నుంచి భద్రాచలం మధ్య ఉన్న ఎన్నో స్థలాలను గుర్తించినది రాజా రామ్ సింగ్.

     ➤ మానవ పరిణామ క్రమం లో మొదటి దశ నుంచి తెలంగాణలో ఆధారాలున్నాయని రాజారాం సింగ్ నిరూపించారు.

     ద్యానవెల్లి సత్యనారాయణ గత కొంత కాలంలో సుమారు 10 చరిత్ర పూర్వయుగం స్థలాలను కనుగొన్నారు
     
    బి.సుబ్రహ్మణ్యం అనే చరిత్రకారుడు రచించిన తెలుగునేలపై పరిశోధనలు అనే పుస్తకం తెలంగాణ చరిత్ర పూర్వ యుగము అధ్యయనానికి ఒక ముఖ్య ఆధారం.

     మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా చరిత్ర పూర్వ యుగానికి కిందివిధంగా విభజించారు.
       ఎ) పాత రాతి యుగం ప్రాచీన శిలాయుగం

     క్రీస్తు పూర్వం రెండు లక్షలు నుండి ఎనిమిది వేల ఐదు వందల సంవత్సరాల క్రితం
     బి)మధ్య రాతియుగం మధ్య శిలాయుగం 

    క్రీస్తు పూర్వం 8500 నుండి మూడు వేల సంవత్సరాల క్రితం
     సి)కొత్త రాతి యుగం నవీన శిలాయుగం 

    క్రీస్తు పూర్వం 3000 నుండి 1500 సంవత్సరాల క్రితం
     డి)రాక్షస గుళ్ల యుగం

     క్రీస్తుపూర్వం 1500 నుండి క్రీస్తుశకం 300 వరకు

     ఎ)పాత రాతి యుగం

      ➤ తెలంగాణ లో దొరికిన పాత రాతియుగపు ఆయుధాలు ఆఫ్రికాలోని అస్యులియాన్  ప్రాంతపు ఆయుధాలను పోలి ఉన్నాయి 

     ➤ పాతరాతి యుగంలో గులకరాయి పనిముట్లు, రాతి పెచ్చులు  పనిముట్లు వాడేవారు

     బి)మధ్య రాతియుగం 
     ➤ మధ్య రాతి యుగానికి మరొక పేరు సూక్ష్మ రాతి యుగము. 
     ➤ ఈ కాలంలో చిన్న చిన్న రాతి పనిముట్లు మైక్రోలిత్స్ వాడేవారు.
     
    ➤ మానవులు శిలా చిత్రాలు వేయడం ప్రారంభించిన యుగం మధ్య రాతియుగం.

     ➤ మధ్య రాతి యుగానికి చెందిన మొదటి తరం చిత్రలేఖనాలు మహబూబ్నగర్ జిల్లా సంగానోనిపల్లి  రాతి గుహలలో కనిపించాయి వాటిలో ప్రధానమైనవి జింకల చిత్రాలు.

     సి)కొత్త రాతి యుగం 

     ➤ ఈ యుగంలో మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేయడం ప్రారంభించాడు.
     
     ➤ ఈ యుగంలో ఎముకలతో ఆయుధాలు, పనిముట్లు తయారు చేసుకున్నారు.

     ➤  కొత్త రాతి యుగం లోనే రాగి, కంచు వంటి లోహాలతో పనిముట్లను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.
     
     ➤ కొత్త రాతియుగపు ప్రజలు రాగులు, ఉలవలు, మినుములు, జొన్నలు పండించేవారు.

      ➤ కొత్త రాతి యుగానికి చెందిన బూడిద కుప్పలు తెలంగాణలోని ఉట్నూరులో బయల్పడ్డాయి.

      ➤ ఈ బూడిద కుప్పలు పశువుల పేడను కాల్చడం ద్వారా ఏర్పడినవి దీన్ని బట్టి ఇక్కడ పశుపోషణ ఉన్నట్లు తెలుస్తోంది.

      ➤ కొత్త రాతి యుగం లో చనిపోయిన వారి తలను ఉత్తరం వైపు పెట్టి ఖననం చేసేవారు.

       ఇద్దరు శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు నాగార్జునకొండలో వెలుగుచూశాయి.

     డి)రాక్షస గుళ్ళు యుగం 
    ➤ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుంచి క్రీస్తుశకం మూడు వందల సంవత్సరాల మధ్య తెలంగాణా లోని ప్రజలు చనిపోయిన వారి అస్థిపంజరాలను  మట్టి శవపేటికలో గాని,రాతి గూడులో కానీ పెట్టి,పూడ్చి ఆ గుడు చుట్టూ పెద్ద పెద్ద రాళ్లను వలయాకారంలో నిలిపేవారు వీటిని రాక్షస గుళ్లని,ఈ యుగాన్ని రాక్షస గుళ్ళయుగము లేదా పెద్ద రాతియుగమని అని అంటారు.
      ➤ ఈ రాక్షస గుళ్లను స్థానిక ప్రజలు పాండవుల గూళ్ళు, వీర్ల పాడులని కూడా పిలుస్తారు. 
      ➤ రాక్షస గుళ్ళు సమాధిలో ఆహారధాన్యాలు, వ్యవసాయ పనిముట్లు, ఆభరణాలు, అతనికి చెందిన అన్ని వస్తువులను పెట్టి పైన పెద్ద బండ నిలిపేవారు.
      ➤ ఈ వస్తువుల ఆధారంగా వీరు అత్యంత నాగరికులుగా చెప్పవచ్చు తెలంగాణలో బృహత్ శిలాయుగంతో  నాగరికత  ప్రారంభమైందని చెప్పవచ్చు. 
      ➤ రాక్షస గుళ్ళు యుగంలోనే మొదటిసారిగా ఇనుము వస్తువులను విరివిగా వాడారు కాబట్టి ఈ యుగాన్ని అయో యుగమని పిలుస్తారు.
     
      హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవరణలో ఉన్న ఒక రాక్షసుడు సమాధి దేశంలోనే మొదటిది అని తేలింది దానిలో దొరికిన ఆహారపు గింజలు 4250 సంవత్సరాల కిందటిదని  శాస్త్రీయ పరిశోధనలో తేలింది.

     
     ➤ రాక్షస స్కూళ్ల నిర్మాణం ఆధారంగా నాలుగు రకాలుగా విభజించారు 
    1 గుంత సమాధులు 
    2 గూడు సమాధులు 
    ౩ గది సమాధులు 
    4 గుహ సమాధులు

     1.గుంత సమాధులు 
      ➤ మట్టి లేదా గ్రానైట్ తో చేసిన శవపేటికలో అస్థిపంజరాన్ని పెట్టి దానిని భూమిలో గుంత త్రవ్వి,పూడ్చి,దానిని చుట్టూ వలయాకారంలో పెద్ద పెద్ద రాళ్ళను నిలుపుతారు.
     2.గూడు సమాధులు 
      ➤ రాతి శవపేటికను పూర్తిగా పూడ్చి వేయకుండా కొంత భాగం భూమి పైకి కనపడే విధంగా పుడ్చుతారు.
     ౩.గది సమాధులు 
      ➤ రాతి సమాధి మొత్తం భూమి యొక్క ఉపరితలం మీద ఉంటుంది.
     4.గుహ సమాధులు 
      ➤ కొండల్లో గుండ్రటి గుహలను,తొలిచి వాటిలో శవాలను పెట్టి కప్పువేస్తారు.

      ➤ రాక్షస గుళ్ళు గా పిలువబడే సమాధిలో ఆహార ధాన్యాలు,ఇనుప వ్యవసాయ పనిముట్లు, ఎరుపు నలుపు రంగు మట్టిపాత్రలు, బంగారు ఆభరణాలు, పూసలు లభించాయి.
       నల్గొండ జిల్లా ఏలేశ్వరం లో ఒక ఏనుగు ఆకారం గల శవపేటిక లభించింది. 
    దానితో పాటు నాలుగు శవపేటికలు లభించాయి.
    దానితో పాటు నాలుగు శవపేటికలు లభించాయి.
      ➤  ఏలేశ్వరం లో బయల్పడిన మరొక సమాధి లో స్త్రీ కళేబరం మీద పడుకోబెట్టి నా పురుష కళేబరం కనిపించింది.
     
      ➤ నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద మెడోస్ టేలర్ జరిపిన తవ్వకాలలో వేలసంఖ్యలో సమాధులు బయటపడ్డాయి. 
      ➤ ఉట్నూరులో బయల్పడిన సమాధి లో ఎరుపు నలుపు రంగు కుండలు లభించాయి.
     
      ➤ హైదరాబాద్లోని మౌలాలి లో 30 నుంచి 40 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలాలు కనిపించినవి ఇక్కడ లభించాయి ఇక్కడ సమాధిలో మట్టి గాజులు,బంగారు పూసలు  లభించాయి. 
      ➤ పోచంపాడు లో బయటపడ్డ రాక్షస గుల్ల లో గుర్రం అస్థిపంజరం  దొరికింది. 
      ➤ 
    హైదరాబాద్ శివార్లలోని హస్మత్ పేటలో ఎముకలతో చేసిన పూసలు లభించాయి.

     చారిత్రక యుగం 

      ➤ చరిత్ర రచనకు సంబంధించి లిఖిత ఆధారాలు ఉండి వాటిని కచ్చితంగా చదవగలిగే కాలాన్ని చారిత్రక యుగం అంటారు.

      ➤ భారతదేశంలో ఈ చారిత్రక యుగం ఆర్యులతో  ప్రారంభం కాగా తెలంగాణ లో క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం నుండి మొదలవుతుంది.

      ఉత్తర భారతదేశంలో ఉన్న ఆర్య సంస్కృతిని వైదేహుడు మొదటగా తూర్పు భారతదేశానికి వ్యాప్తి చేశాడు.

      ➤ అగస్త్యుడు ఆర్య సంస్కృతిని దక్షిణ భారత దేశానికి మొదటగా వ్యాప్తి చేశాడు.

      ➤ క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా బౌద్ధ జైన మతం వంటి 62 మతాలు ఆవిర్భవించాయి

    బౌద్ధ మత గ్రంథాలను త్రిపిఠికాలు అంటారు అవి

    1 సుత్త  పీఠిక

    2 వినయ పీఠిక
    3 అభిధమ్మ పీఠిక
      ➤ అస్మక జనపద ప్రదేశం- నీటి నిజాంబాద్ కరీంనగర్ అదిలాబాద్ మాత్రు జిల్లాలు.

      ➤ అంగుత్తరనికాయ అనే బౌద్ద గ్రంధంలో క్రీ.పూ.6వ శతాబ్దంలో వెలిసిన 16 మహా  జానపదాల గురించి మొదటిసారిగా ప్రస్తావించబడింది.

      ➤ ఈ 16 మహాజనపదలలో దక్షిణ భారతదేశంలో ఏకైక మహాజనపదం అస్మక తెలంగాణాలో ఉండేది.మిగతా 15 మహాజనపదలు ఉత్తర భారతదేశంలో ఉండేవి.

      ➤ ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారి ఋగ్వేదం లో భాగమైన ఐతరేయబ్రాహ్మణంలో  ఉంది.

      ➤ ఈ అస్మక రాజ్య రాజధాని పోదన్/పోతన.(ప్రస్తుత బోధన్) నిజామాబాద్ జిల్లా

      ➤ అస్మక రాజ్యం లోని బావరి బౌద్ధమతాన్ని ఆంధ్ర మరియు తెలంగాణ లో వ్యాప్తి చేశాడు అని పేర్కొంటారు.

      ➤ నంద వంశానికి చెందిన మగధ పాలకుడు మహాపద్మనందుడు అస్మక  రాజ్యాన్ని జయించి భారత దేశ చరిత్రలో మొదటిసారిగా దక్షిణ భారతాన్ని పాలించిన చక్రవర్తి గా గుర్తింపు పొందాడు.

      మహాపద్మనందుడు తర్వాత మగధను పాలించిన మౌర్యులు కూడా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల సామంత రాజ్యాలుగా చేసుకున్నారు.

      ➤ తదుపరి శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపన చేసి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించారు.

      ➤ తదుపరి తెలంగాణ ఉత్తర దక్షిణ భారతదేశాల సంగమ స్థానంగా వర్ధిల్లింది.

       తెలంగాణ అనే పదం ముఖ్యంగా ఢిల్లీ సుల్తానుల కాలం నుండి వ్యవహారంలోకి వచ్చింది అమీర్ ఖుస్రూ అనే  కవి తెలంగాణను పేర్కొన్నాడు.

      ➤ ఢిల్లీ సుల్తానుల కాలంలో తెలంగాణ,ఆంధ్ర తమిళనాడు వరకు గల ప్రాంతాలను కలిపి తెలంగాణ గా వ్యవహరించేవారు.

      ➤ తదుపరి గోల్కొండ కుతుబ్ షాహిల కాలంలో తెలంగాణ అంటే నేటి తెలంగాణతోపాటు కోస్తాంద్ర కూడా ఉండేది.

      ➤ నిజాం పాలన నుండి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష ప్రాంతాన్ని తెలంగాణ గా వ్యవహరించడం సాధారణమైంది.

      ➤బౌద్ద జాతక కథలు (క్రీస్తు పూర్వం 600 నుండి 400) గోదావరి కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని అందపథం(ఆంధ్రాపధం),అంధక రట్టం అని పేర్కొన్నారు.

      ➤ సుత్త పిటకంలో  భాగమైనా సుత్తనిపాదం ప్రకారం గోదావరి నదికి ఇరువైపులా అలక(అస్మక),ములక(నాందేడ్,ఔరంగాబాద్ జిల్లాలు) రాజ్యలున్నాయని వాటిని అందకరట్టలుగా పేర్కొంది.

      ➤ ములక రాజ్య రాజధాని-ప్రతిష్టానపురం.

    తెలంగాణలోని వివిధ ప్రాంతాలను పూర్వ యుగం నుండి ఆధునిక యుగం వరకు పాలించిన ముఖ్య రాజవంశాలు (వారి పాలన కాలం) వరుసక్రమంలో: 

      ➤ శాతవాహనులు క్రీస్తుపూర్వం 220 నుండి క్రీస్తుశకం 225. 

      ➤ ఇక్ష్వాకులు క్రీస్తు శకం 220 నుండి క్రీస్తు శకం 300 

      ➤ విష్ణుకుండినులు  క్రీ.శ 358 నుండి 569  

      ➤ వేములవాడ చాళుక్యులు క్రీస్తుశకము 750 నుండి 978 (పశ్చిమోత్తర తెలంగాణా ప్రాంతం).

      ➤ ముదిగొండ చాళుక్యులు క్రీస్తుశకము 850 నుండి 1200 

      ➤ కాకతీయులు  

      ➤ సామంత కాకతీయులు క్రీస్తుశకం 956 నుండి 1162

      ➤ స్వతంత్ర కాకతీయులు  క్రీస్తుశకం 1163 నుండి 1323

      ➤ ముసునూరి నాయకులు క్రీస్తుశకం 1325 నుండి 1368(ఖమ్మం జిల్లా ప్రాంతాలు)

      ➤ వెలమ నాయకులు  క్రీస్తుశకం 1325 నుండి 1475(నల్గొండ,మహబూబ్నగర్ ప్రాంతాలు)

      ➤ కుతుబ్షాహీలు క్రీస్తుశకం 1518 నుండి 1687

      ➤ అసఫ్జాహీలు క్రీస్తుశకం 1724 నుండి 1948





     

     

    Post a Comment

    0 Comments