Ikshwaku Dynasty history in Telugu

ikshwaku dynasty history in telugu


ఇక్ష్వాకులు Ikshwaku

(క్రీ.శ.220-300)



After the fall of the Shatavahana Empire, the Ikshwaku declared independence in the coastal areas of Telangana.


➤ శాతవాహన సామ్రాజ్యం పతనమైన తరువాత తెలంగాణ - కోస్తాంధ్ర ప్రాంతాలలో ఇక్ష్వాకులు స్వతంత్ర్యం ప్రకటించుకున్నారు.


 ఇక్ష్వాకులు నాగార్జునకొండ సమీపంలోని విజయపురి ని రాజధానిగా చేసుకుని కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పాలించారు.


 విజయపురికి మరొక పేరు శ్రీపర్వతం, కావున పురాణాలలో ఇక్ష్వాకులను శ్రీ పర్వతీయులుగా పేర్కొన్నారు.


 నాగార్జున కొండతో ప్రారంభించి శ్రీశైలం పర్వతం వరకుగల పర్వత పంక్తిని శ్రీపర్వతం అంటారు.


 శ్రీపర్వతం ప్రాచీన నామం - నల్లమల్లూరు.


 వీరు ఆరాధించే చిహ్నం - ఇక్షు


 ఇక్ష్వాకు అనే పేరు “ఇక్షు” అను పదం నుండి వచ్చింది. ఇక్షు అనగా చెరకు అని అర్థం.


 ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని అల్లూరి శాసనం తెలియజేస్తుంది.


 ఈ అల్లూరి శాసనం ను వేయించినది - వీరపురుషదత్తుడు

ఇక్ష్వాకుల ikshwaku

• వంశ స్థాపకుడు                              - శ్రీశాంత మూలుడు 

 రాజధాని                                      - విజయవురి 

 రాజభాష                                      - ప్రాకృతం 

• రాజలాంఛనం                                - సింహం

 మతం                                          - వైదికం, బౌద్ధమతం

• ప్రసిద్ధి శిల్పం                                  - మాందాత శిల్పం (అమరావతి శిల్పకళకు                                                                                            చెందినది)  

 ఇక్ష్వాకులలో గొప్పవాడు                     - వీరపురషదత్తుడు


ఇక్ష్వాకుల జన్మ సిద్దాంతాలు: Birth theories of Ikshwaku


1. ఇక్ష్వాకులు కన్నడీగులు : 

కన్నడ సిద్ధాంతం - హెగెల్, స్టెన్కోనో 


2. ఇక్ష్వాకులు తమిళ ప్రాంతీయులు : 

తమిళ సిద్ధాంతం - డా.కె. గోపాలాచారి 


3. ఇక్ష్వాకులు ఆంధ్రప్రాంత స్థానికులు: 

ఆంధ్రవాదం - బిషప్ కాల్డువేల్ 


4. ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు :  రాప్సన్ & బుల్లర్


 విష్ణుపురాణం ప్రకారం ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు.


 బిషప్ కార్డ్ వెల్ అనే పోర్చుగీసు మత ప్రచారకుడు ద్రావిడ భాషలకు, తెలుగు భాషకు మధ్యగల సంబంధమును తులనాత్మక అధ్యయనం చేసాడు.


 బిషప్ కా వెల్ రాసిన గ్రంథం - “A Comparative Grammer to Dravidian Languages"


 ఇక్ష్వాకులు చెంచుజాతికి చెందినవారని పేర్కొన్నది - P.సుబ్రహ్మణ్యం


 ఇక్ష్వాకులు తాము ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరామచంద్రుని, బుద్దుని (శాక్యముని) వంశానికి చెందిన వారమని నాగార్జున కొండ శాసనంలో ప్రకటించుకున్నారు.


  డా.ఆర్.జి.భండార్కర్ ప్రకారం ఇక్ష్వాకులు క్షత్రీయులు.



ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు 

Evidence for the history of Ikshwaku


  ఇక్ష్వాకుల శాసనాలు నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరిలో దొరికాయి.


  ఈ శాసనాలు ప్రాకృత భాషలో, బ్రాహ్మీలిపిలో రాయబడ్డాయి. శాంతమూలుడి కాలం నుండి శాసనాలు సంస్కృతం లో వేయబడ్డాయి.


  నాగార్జున కొండ త్రవ్వకాలలో ఇక్ష్వాకుల కాలం (క్రీ.శ. 3వ శతాబ్దం) నాటి కోట, బౌద్ధస్థూపాలు, చైత్యాలు, విహారాలు, దేవాలయాలు, స్నానఘట్టాలు మొదలగునవి ఎన్నో బయల్పడ్డాయి.


  మొదటిసారి నాగార్జునకొండ అవశేషాలను 1926 లో పురావస్తు శాఖలో పనిచేసే తెలుగు అసిస్టెంట్ ఎ.రంగనాథ సరస్వతి గుర్తించాడు.


  ఇక్ష్వాకు రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సంప్రదాయాన్ని శాతవాహనుల నుండి స్వీకరించారు. ఈ సంప్రదాయం ఇక్ష్వాకులతోనే అంతమైనది.


  న్యాయ సేనుడు రచించిన ధర్మామృతం గ్రంథంలో శ్రీపర్వతమునకు సంభంధించిన విషయాలు ఉన్నవి.


  అశ్వఘోషుడు రచించిన బుద్ధ చరిత గ్రంథం ఇక్ష్వాకుల పుట్టుపూర్వోత్తరాలను గురించి తెలుపుతుంది. 


ఇక్ష్వాక రాజులు - చరిత్ర 

Ikshwaku Kings-Ikshwaku History



  ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజుల సంఖ్య - 4 


1. వాశిష్టీపుత్ర శ్రీ శాంతమూలుడు (క్రీ.శ. 220-233)

Vashishtiputra Sri Shantamulu


  ఇక్ష్వాకు వంశస్థాపకుడు


  ఇతని శాసనాలు రెంటాల, కేశనపల్లి, దాచేపల్లి వద్ద దొరికాయి. 


  ఇతడు వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింప చేసాడు.


  ఇతనికి ఇద్దరు సోదరీమణులు - శాంతశ్రీ, హర్మ్యశ్రీ


  తన సోదరి శాంతశ్రీని పూగీయ వంశానికి చెందిన స్కంధశ్రీతో వివాహం జరిపించాడు.


  ఇతడు తన కుమారుడైన వీరపురుషదత్తుడికి ఉజ్జయిని పాలకుడైన రుద్రదాముడి కుమార్తె రుద్ర భట్టారిక తో వివాహం చేసాడు..


  ఇతను వైదిక మతాన్ని అవలంభించాడు.


  ఇతని ఆరాధ్య దైవం - కార్తికేయుడు. అయితే మహసేన విరూపాక్ష సుబ్రహ్మణ్యస్వామి లను కూడా పూజించేవాడు.


  బ్రాహ్మణులకు అనేక అగ్రహారాలను, సేద్యపు భూములను విరివిగా దానం ఇచ్చి బ్రహ్మణ మత విస్తరణకు పూనుకున్నాడు.


  ఇతని రెంటాల, దాచేపల్లి (ప్రాకృతం) శాసనాలలో ఇతని గురించి క్రింది విధంగా ఉంది.


• లక్షల కొలది బంగారు నాణేలు దానం చేశాడు. నేగిమాలు అనే వర్తక వ్యాపారాలను ప్రోత్సహించాడు.


• శ్రీశైలం మహాక్షేత్రానికి ఈశాన్య ద్వారం ఏలేశ్వరమును పునర్నిర్మించాడు.


• అడవులను బాగుచేసి వ్యవసాయాభివృద్ధికి కృషిచేశాడు. • ఇతను వ్యవసాయాభివృద్ధి కోసం లక్షలాది గోవులను, నాగళ్ళను, బంగారు నాణేలు, భూములను దానం చేసాడు. 


  ఫలితంగా ఇతను పొందిన బిరుదులు :


1. శతసహస్ర హలక 

2. గోశతసహస్ర

3. మహాధానపతి 

4. దక్షిణపథపతి

5. అప్రతిహత శాసనుడు


  ఇతడు అశ్వమేథ, వాజపేయ, రాజసూయ యాగాలు,అగ్నిస్తోమ, అగ్నిహోత్ర ఇత్యాది వైదికమత క్రతువులను నిర్వహించాడు.


2.మాఠరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుడు (క్రీ.శ. 233–253) 

Mathariputra Sri Veerapurushadatta


  ఇతను ఇక్ష్వాకులు అందరిలో గొప్పవాడు


  ఇతని బిరుదులు దక్షిణాది అశోకుడు, ఇక్ష్వాక అశోకుడు 


  వీరపురుష దత్తుడు మొదట వైదిక మతస్థుడు. తదుపరి ఇతని మేనత్త శాంతశ్రీ ప్రోత్సాహం మేరకు బౌద్ధమతాన్ని స్వీకరించాడు.


  ఇక్ష్వాకు రాజులలో బౌద్ధమతాన్ని స్వీకరించిన ఏకైక రాజు - వీరపురుషదత్తుడు


  ఇతను పాలనాకాలాన్ని మహాయాన బౌద్ధ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.


  ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ దక్షిణగయగా ప్రసిద్ది చెందింది.


  ఇతని కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది.


   ఇది భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం. 


  ఇతని మేనత్త శాంతశ్రీ నాగార్జున కొండవద్ద బుద్ధుడి ధాతువును నిక్షిప్తం చేసిన 'మహాచైత్యాన్ని' నిర్మించింది.


  బ్రాహ్మణులు, శ్రామణులు, పేద ప్రజలను కనుకరించి శాంతశ్రీ అనేక దానాలు చేసిందని నాగార్జున కొండ శాసనం తెలియజేస్తుంది.


  వీరపురుష దత్తుడు తన మేనత్త శాంతశ్రీ యొక్క నలుగురు కుమార్తెలను వివాహమాడాడు.


  ఇతని కాలం నుండే మేనత్త కుమార్తెలను వివాహమాడే సాంప్రదాయం ప్రారంభమైనది.


  వీరపురుషదత్తుడు శైవమతాన్ని ద్వేషించి, శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు చిత్రీకరించబడిన శిల్పం నాగార్జున కొండలో కలదు.


  నాగార్జునకొండలో ఇక్ష్వాకుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ శిల్పాలు బయల్పడినవి. వీటినే 'మానవీయ శిల్పాలు' అని పేర్కొంటారు.


  ఈ వీర పురుష దత్తుడు వేయించిన శాసనాలు: 

 జగ్గయ్యపేట శాసనం

• అల్లూరి శాసనం 

• నాగార్జునకొండ శాసనం 

 అమరావతి శాసనం 

• ఉప్పుగుండూరు శాసనం


ఉపాసిక బోధిశ్రీ


  వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళా సన్యాసిని ఉపాసిక శ్రీ

  ఈమె వీరపురుషదత్తుడి రాజ్యభాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు. 


  ఈమె శ్రీ పర్వత ప్రాంతానికి చెందిన రేవంతుడి కుమార్తె


  ఉపాసిక బోధిశ్రీ బౌద్ధమత సేవను వివరించిన శాసనం - ఉపాసిక శాసనం (అమరావతి)


  ఉపానిక భోదిశ్రీ నాగార్జునకొండ వద్ద ఉన్న చుళదమ్మగిరి అనే కొండపై బౌద్ధ ఆరామాన్ని నిర్మించినది.


  సింహళ విహారంలోని భోదివృక్షానికి వేదికను నిర్మించింది.


ఉపాసిక బోధిశ్రీ ఇతర నిర్మాణాలు:


• పారావత విహారమునకు ఎదురుగా శిలామండపము

• పూర్వశిల వద్ద తటాక మండపము

• దేవగిరిపై ప్రార్ధనశాలను

• కులహావిహారం వద్ద ఒక చైత్యం

• మహదమ్మగిరిపై విహారం

• పాపిల వద్ద ఏడు విహారాలను, ఇరుముత్తవ వద్ద మూడు విహారాలు నిర్మించింది.


భావవివేకుడు :


  వీరపురుషదత్తుడి కాలంలో నాగార్జునకొండ వద్ద నివసించిన బౌద్ధమత తార్కికుడు భావవివేకుడు 


  భావవివేకుడు వివరించిన బౌద్ధమత సిద్ధాంతం స్వతంత్ర మాధ్యమిక వాదం, న్యాయప్రయోగ సిద్ధాంతం 


  ఇతని రచనలు:


* తర్కజ్వాల, ప్రజాప్రదీప, కరతల రత్న


  భావవివేకుడి గురించి పేర్కొన్న చైనా యాత్రికుడు - హుయాన్‌త్సాంగ్


3. ఎహువల శాంతమూలుడు (క్రీ.శ. 253-277)

Ehuvala Shanthamula 


  ఎహువల శాంతమూలుడి మరొక పేరు వాశిష్టీపుత్ర బాహుబల శాంతమూలుడు, రెండవ శాంతమూలుడు, వశ్మీభట్ట ఎహువల శాంతమూలుడు.


  తాత పేరును పెట్టుకునే సంప్రదాయం ఇక్ష్వాకుల నుండే ప్రారంభం అయినది.


  ఎహువల శాంతమూలుని కాలం నాటికి ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజభాషగా స్థిరపడింది.


  ఇతని కాలం నుండి సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం ప్రారంభం అయినది


  దక్షిణభారత దేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాలను ఎహువల శాంతమూలుడు వేయించాడు.


  ఇతడు నాగార్జున కొండవద్ద సంస్కృత శాసనం వేయించాడు ఇతని సంస్కృత శాసనం - గుమ్మడి గుర్రు శాసనం


  ఇతను వైదిక మతాన్ని అనుసరించాడు. ఇతని కాలంలో బౌద్ధమతం, హిందూ మతం రెండూ అభివృద్ధి చెందాయి. 


  దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయ నిర్మాణమును ప్రారంభించిన మొదటి రాజు - ఎహువల శాంతమూలుడు. 


  ఇతడు పుష్పభద్రస్వామి ఆలయాన్ని నాగార్జునకొండలో నిర్మించాడు.


  ఇతని కాలంలో నాగార్జున కొండలో నిర్మించబడిన ఆలయాలు : 


• కార్తికేయ ఆలయం 

• పుష్పభద్రస్వామి ఆలయం

 • నోడిగిరీశ్వరాలయం 

• హారతీ ఆలయం

కుబేరస్వామి ఆలయం 

• నవగ్రహ ఆలయం


  హారతి దేవాలయంలోని సప్తమాత్రుకల వద్ద ఆ కాలం నాటి స్త్రీలు సంతానం కోసం గాజులను సమర్పించేవారు. 


  ఎహువల శాంతమూలుడి సేనాధిపతి - ఎలిశ్రీ


   ఎలిశ్రీ 'ఏలేశ్వరం' అనే పట్టణాన్ని నిర్మించాడు,


  ఈ పట్టణంలో ఎలిశ్రీ 'సర్వదేవాలయం' అనే పేరుమీద ఒక శివాలయాన్ని నిర్మించాడు.


  ఎహువల శాంతమూలుడి కాలంలో ఇక్ష్వాకుల రాజ్యంపై అభీర రాజ్య వసుసేనుడు దండయాత్ర చేసాడు.


  అభీరవసుసేనుడు విజయపురి ప్రాంతాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినట్లు తెలియజేయు శాసనం - నాగార్జునకొండ శాసనం


  అభీర వసుసేనుడి సేనాని శివసేనుడు నాగార్జునకొండలో నిర్మించిన ఆలయం - అష్టభుజస్వామి ఆలయం


  ఈ అష్టభుజస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోనే తొలి విష్ణుదేవాలయం



4. రుద్రపురుషదత్తుడు (క్రీ.శ. 283-301)

Rudrapurushadatta


  ఇక్ష్వాకులలో చివరివాడు.


  ఇక్ష్వాకుల చివరిరాజైన రుద్రపురుషదత్తుడిని పల్లవరాజైన సింహవర్మ ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని ఆక్రమించాడు.


  పై విషయాన్ని తెలియజేయు శాసనం-మంచికల్లు శాసనం 


  మంచికల్లు శాసనం జారీచేసినది - పల్లవ వీరకూర్చ వర్మ

 

  ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని పతనం చేసినవారు-ప్రాచీన పల్లవులు


   ఇక్ష్వాకుల రాజ్యపతనం గురించి పేర్కొన్న మరొక శాసనం - మైదవోలు శాసనం (శివస్కంధ వర్మ)


  ఇక్ష్వాకుల పతనం తరువాత కృష్ణానది లోయలో ఇక్ష్వాకుల సామంతులు బృహత్పలాయనులు స్వతంత్రం ప్రకటించుకున్నారు.



ఇక్ష్వాకుల పరిపాలన & వాణిజ్యం

Administration & Commerce of the Ikshwaku



  ఇక్ష్వాకులు కొద్దిపాటి మార్పులతో శాతవాహనుల పరిపాలనా విధానాలనే కొనసాగించారు.


  ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని కొన్ని రాష్ట్రాలుగా విభజించారు. 


  అల్లూరి, అమరావతి శాసనాలలో రఠ (రాష్ట్రం) ప్రస్తావన ఉంది. 


  ఇక్ష్వాకుల కాలంలో 5 గ్రామాలను కలిపి గ్రామపంచక అని పిలిచేవారు.


  గ్రామాధికారి - తలవర


  ఇక్ష్వాకుల కాలంలో ప్రధానవృత్తి - వ్యవసాయం


   ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం - భూమిశిస్తు


  భూమిశిస్తును భాగ అనేవారు, శిస్తు పంటలో 1/6వ వంతు వసూలు చేసేవారు.


  ధనరూపంలో వసూలుచేసే పన్ను - హిరణ్యం/దేయం 


  ధాన్య రూపంలో వసూలు చేసే పన్ను - మేయం


   ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన ఓడరేవు - ఘంటశాల


  ఇక్ష్వాకుల కాలం నాటి చేతి పరిశ్రమల గురించి తెలియజేయు శాసనం - విషవట్టి శాసనం


  వృత్తిపనివారు శ్రేణులుగా ఏర్పడి వ్యాపారం చేసేవారు 


పూసిక శ్రేణి - మిఠాయి వర్తక శ్రేణి

పర్ణిక శ్రేణి - తమలపాకుల వారి శ్రేణి


  ఇక్ష్వాకుల కాలం నాటికి రోమ్ దేశంతో వాణిజ్యం ఉన్నత స్థితిలో జరిగింది.


  నాగార్జునకొండ, జగ్గయ్యపేటలలో రోమన్ బంగారు నాణేలు లభించాయి.


  ఈ కాలం నాటి వర్తక సంఘాలు - నేగిమాలు 


  శాతవాహన యుగ అనంతరం నగర జీవన విధానం నశించి స్వయం పోషకమై, పరిమితమైన బాహ్య సంబంధాలు గల స్తబ్దమైన గ్రామీణ జీవన విధానం పెరిగింది.


 ఇక్ష్వాకుల సాంస్కృతిక వికాసం

Cultural development of the Ikshwaku


  ఇక్వాకుల కాలంలో మత, సాహిత్య, వాస్తు, కళారంగాలు గణనీయమైన ప్రగతిని సాధించాయి.


  ఇక్ష్వాకు రాజులలో వీరపురుషదత్తుడు తప్ప, మిగిలిన ముగ్గురు రాజులు వైదికమతాన్ని అవలంభించారు.


  ఇక్ష్వాకుల అధికార మతం - శైవమతం.


  అయితే వీరు బౌద్ధమతంను కూడా ఆదరించారు 


  వీరపురుష దత్తుడి కాలంలో ఆంధ్రలో బౌద్ధమతం వ్యాప్తి జరిగింది.


  వీరపురుషదత్తుడి సోదరి అడవి శాంతిశ్రీ నాగార్జున కొండవద్ద బౌద్ధ ఆరామవిరామంను బౌద్ధ భిక్షువులకు దానం చేసింది.


  వీరపురుషదత్తుడి కుమార్తె కొడబలిసిరి నాగార్జునకొండ వద్ద ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించినది.


  బౌద్ధమతంలోని పూర్వశైలీయులకు - అమరావతి, అపరశైలీయులకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రంగా ఉండేవి.


  బౌద్ధ గ్రంథాలలోని నిఖయలను మంత్రాల రూపంలో చదివే పద్దతి మొట్టమొదటిసారి ప్రారంభమైంది.


  బౌద్ధ స్థూపాల నిర్మాణంలో కోరికలు తీరినందుకు గాను కట్ట బడే 'ముడువు స్థూవముల' నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.


నోట్: 2015 జనవరిలో సూర్యాపేట జిల్లా ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో క్రీ.శ 3వ శతాబ్దం నాటి మహాస్థూపం వద్ద రాగి, సీసంతో తయారైన ధాతుపాత్ర లభించింది.


  2015 జూన్ లో కరీంనగర్ జిల్లా సింగరాయలొద్ది లో నాలుగు తలలున్న బుద్ధ విగ్రహాన్ని వెలికితీసారు.


  ఆచార్య నాగార్జునుడి శిష్యుడు ఆర్యదేవుడు రచించిన గ్రంథం - చిత్తశుద్ధి ప్రకరణం 


  ప్రాకృతం ఇక్ష్వాకుల రాజభాష అయినప్పటికీ సంస్కృతం మంచి ఆదరణ, అభివృద్ధిని సాధించింది.


శిల్పకళ

Ikshwaku Sculpture


  ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళకు నాగార్జునకొండ ప్రధాన కేంద్రంగా ఉంది.


  ఈ కాలంలో శిల్పాల నిర్మాణం మహాయాన బౌద్ధంను అనుసరించి జరిగింది,


  అమరావతి శిల్పాలలో సతీసహగమనం మొదటిసారిగా కనిపిస్తుంది.


మాందాత శిల్పం


 ఇక్ష్వాకుల కాలం నాటి అతిముఖ్యమైన శిల్పం - మాందాత శిల్పం


 ఈ శిల్పం జగ్గయ్యపేటలో కనుగొన్నారు.


 చక్రవరి ఏ విధంగా ఉంటాడో మొట్టమొదటిసారి మాందాత శిల్పంలో చూపించారు.


 శాసనాలపై సంవత్సరాలను, తారీఖు, తిథిలను ప్రస్తావించే ఆచారం ఇక్ష్వాకుల కాలం నుండే ప్రారంభమైనది.


 దేవాలయాలపై, శిల్పాలపై శిల్పి పేరు లిఖించే సంప్రదాయం ఈ యుగంలోనే ప్రారంభమైనది.


 నాగార్జునకొండలోని బౌద్ధ విహారములను నిర్మించిన శిల్పిగా “బదంతాచార్య' యొక్క పేరు చెక్కబడినది.


 ఇక్ష్వాకుల కాలంలో ధాన్యకటకం (అమరావతి), నాగార్జునకొండల్లోని విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధిగాంచాయి


 క్రీ.శ. రెండో శతాబ్దం నాటికి నాగార్జునకొండ భారతదేశంలోనే ప్రసిద్ధ బౌద్ధ ఆరామంగా విలసిల్లింది.


 ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ వద్ద నిర్మించిన ప్రఖ్యాత నిర్మాణం - ధ్వని విజ్ఞాన కేంద్రం (ప్రేక్షాగారం)


 ఇక్ష్వాకుల కాలంలో నిర్మించబడ్డ అతి ముఖ్యమైన స్థూపం - నేలకొండపల్లిలో ఉంది.


 నేలకొండపల్లి త్రవ్వకాలలో ఇక్ష్వాకుల కాలం నాటి బుద్ధుని కంచు విగ్రహం, పాలరాయిపై చెక్కిన తొమ్మిది బుద్ధ విగ్రహాలు బయల్పడ్డాయి.


 గాజులబండలో సున్నపురాయితో చేసిన రెండు సింహాల బొమ్మలు, బౌద్ధ స్థూపం దొరికాయి


ఇక్ష్వాకుల ఇతర ముఖ్య నిర్మాణాలు


 ఏలేశ్వరంలో సర్వదేవాలయం

• చేజర్ల సప్తమాతృకల విగ్రహాలు

• వీరాపురం దేవాలయం

• కొణిదెన, పెద్ద ముడియం శిల్పఫలకాలు


 వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే విరాగల్ అనే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుండే ప్రారంభమైంది.


ప్రముఖ బౌద్ధమతాచార్యుల రచనలు 

Works of eminent Buddhist priests in ikshwaku dynasty


బుద్ధఘోషుడు (5వ శతాబ్దం)


 ఇతను బౌద్ధమతంలోని హీనాయాన శాఖను ప్రచారం చేశాడు.


 ఇతను నాగార్జునకొండలోని సింహళ విహారంలో నివసించాడు.


 ఇతను బౌద్ధమత గ్రంథాలపై త్రిపీఠకాల పై వ్యాఖ్యానాలు రాశాడు. వీటినే 'విసుద్ధిమగ్గ / విభాష' అంటారు,


 బుద్ధపాలిత (5, 6వ శతాబ్దం)


 బౌద్ధంలో 'ప్రసాంగిక మాధ్యమిక వాదం' రూపకర్త 


మైత్రేయనాథుడు


 బౌద్ధంలో 'యోగాకారతత్వం'ను ప్రారంభించిన మైత్రేయనాథుడు.


దిగ్నాగుడు (5వ శతాబ్దం)


 ఆ ఇతనిని 'భారత తర్కశాస్త్ర పితామహుడు' అంటారు. . 

ఇతని రచనలు : 


• ప్రమాణ సముచ్ఛయ

• న్యాయప్రవేశ

• హేతుచక్ర ధమరు


 ధర్మకీర్తి (6,7వ శతాబ్దం)


  ఇతనిని 'కాంట్ ఆఫ్ ఇండియా' గా పిలుస్తారు.


రచనలు:

• ప్రమాణవార్తిక

• న్యాయబిందు

 హేతుబిందు


శాతవాహన  పూర్వ యుగం ఆర్టికల్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి 

శాతవాహన యుగం ఆర్టికల్ కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి 



Post a Comment

0 Comments