Historians believe that Vishnukundins was born in a fort area in the Amrabad Zone (present day Munnur) of Mahabubnagar District.
విష్ణుకుండినులు Vishnukundins
(క్రీ.శ 358 - క్రీ.శ 569)
విష్ణుకుండినుల
వంశ స్థాపకుడు - ఇంద్రవర్మ (మహారాజేంద్ర వర్మ)
రాజధాని - ఇంద్రపాల నగరం, కీసర, అమరపురం, దెందులూరు
మతం - వైదికమతం (వైష్ణవం)
రాజభాష - సంస్కృతం
రాజలాంఛనం - పంజా ఎత్తిన సింహం
చివరివాడు - మంచన భట్టారకుడు
విష్ణుకుండినుల కులదైవం - శ్రీపర్వతస్వామి (శ్రీశైల మల్లికార్జునుడు)
వంశంలో గొప్పవాడు - రెండవ మాధవవర్మ
ప్రత్యేకత - నరమేధ యాగం / నరబలిని ప్రోత్సహించుట
శిల్పకళ - గుహాలయాలు (ఉండవల్లి)
• విష్ణుకుండినులు తమను తాము అమరపురీశులు,శ్రీపర్వతస్వామి పాదానుధ్యానులుగా పిలుచుకున్నారు.
• వీరి నాణెములపై చిహ్నం - నంది
• విష్ణుకుండినుల స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని (నేటి మున్నూరు) కోట ప్రాంతం అని చరిత్రకారులు భావిస్తున్నారు.
• విష్ణుకుండినుల రాజ్యవిస్తరణ ఆమ్రాబాద్ మండలంలోని మునులూరు (నేటి మున్ననూరు) కోట ప్రాంతం నుండి ప్రారంభం అయ్యింది.
• అక్కడికి దగ్గరిలో ప్రసిద్ధ ఉమామహేశ్వర క్షేత్రం ఉంది. ఆ ప్రాంతం తుమ్మెద మామిడి చెట్లకు పేరుగాంచింది. ఆ చెట్టు మామిడి కాయలను పగులగొడితే అందులో నుంచి తుమ్మెదలు వచ్చేవి.
• విష్ణుకుండినులు సంస్కృతికరణలో భాగంగా వారి రాజధాని అయిన మామిడిపురం పేరును అమరపురంగా మార్చుకున్నారు.
• మామిడిని సంస్కృతంలో ఆమ్రం అని అంటారు
• విష్ణుకుండినుల మొదటి రాజధాని -అమరపురం /ఇంద్రపురం/ఇంద్రపాల నగరం
• అమరపురం అనగా నేటి మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రం.
• ఇంద్రపాలనగరం ప్రస్తుతం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం తుమ్మలగూడెం శివారులో ఉంది.
• విష్ణుకుండినుల రెండవ రాజధాని - దెందులూరు (పశ్చిమగోదావరి జిల్లా)
• విష్ణుకుండినులు కాందార రాజుల నుంచి త్రికూటమలయ అనే బిరుదును పొందారు.
• విష్ణుకుండినుల గురించి వివరించే సమగ్ర శాసనం - తుమ్మలగూడెం శాసనం
• మొదటి తుమ్మలగూడెం శాసనం - 1వ గోవిందవర్మ
• రెండవ తుమ్మలగూడెం శాసనం - విక్రమేంద్ర భట్టారకుడు వేయించారు.
• వీరి రాజ్యాన్ని విష్ణుమూర్తి యొక్క కౌస్తుభంతో పోల్చారు.
• వీరు 'హిరణ్యగర్బ' అనే యాగం చేసి బ్రాహ్మణుల, క్షత్రియుల తేజస్సు తెచ్చి పెట్టుకున్నారు.
• విష్ణుకుండీ అనుపదం వినుకొండకు సంస్కృతీకరణ పదం అని వివరించిన చరిత్రకారుడు - కిల్ హరన్
• విష్ణుకుండినులు వాకటకులకు సామంతులు
విష్ణుకుండినుల చరిత్ర ఆధారాలు Evidence of the history of Vishnukundins
శాసన ఆధారాలు
శాసనం పేరు ప్రాంతం
1.తుమ్మలగూడెం రాగిశాసనాలు-2 -వలిగొండ మండలం, యాదాద్రి జిల్లా
2. చైతన్యపురి శిలాశాసనం - హైదరాబాద్
3. కీసరగుట్ట శిలాశాసనం - మేడ్చల్ జిల్లా
4. సలేశ్వరం శిలాశాసనం - అమ్రాబాద్,నాగర్ కర్నూల్
5. వేల్పూరు శిలాశాసనం - గుంటూరు జిల్లా
6. ఈపురు రాగి శాసనాలు-2 - గుంటూరు జిల్లా
7. రామతీర్థం రాగి శాసనం - విశాఖపట్నం
8. చిక్కుళ్ళ రాగి శాసనం - తుని, తూ.గో
9, తుండి రాగి శాసనం - తుని, తూ.గో
10. పాలమూరు రాగి శాసనాలు - తూ.గో జిల్లా
11. ఖానాపూర్ రాగి శాసనం - సతార (మహారాష్ట్ర )
సాహిత్య ఆధారాలు:
1. జనాశ్రయ ఛందోవిచ్ఛిత్తి
2. సేతుబంధ
విష్ణుకుండినుల రాజులు kings of Vishnukundins
ఇంద్రవర్మ (మహరాజేంద్రవర్మ) (క్రీ.శ. 358-370)
• ఇతని బిరుదు ప్రియపుత్రుడు
• ఇంద్రవర్మనే మహారాజేంద్రవర్మ అని కూడా పిలుస్తారు.
• విష్ణుకుండినుల పాలకులలో మొదటి వాడు ఇంద్రవర్మ. ఇతను రామతీర్థం శాసనం జారీచేసాడు.
• ఇంద్రవర్మ నల్గొండ జిల్లా ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం) ను రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు.
మొదటి మాధవవర్మ (క్రీ.శ. 370-398)
• ఇతని బిరుదు - విక్రమహేంద్ర
• మొదటి మాధవవర్మ రాజధానిని వినుకొండ నుండి కీసరకు మార్చాడు.
• మొదటి మాధవవర్మ ఉండవల్లి, భైరవకోన, మొగల్రాజపురం గుహలను తొలిపించాడు.
• ఇతను వాకటకుల రాకుమార్తెను వివాహం చేసుకున్నాడు.
• ఇతను ఋషిక మండలంను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని ఋషిక మండలం అనేవారు.
• ఈ ఋషిక మండలం క్రింద వచ్చే ప్రాంతాలు ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు
మొదటి గోవిందవర్మ
* ఇతని రాజధాని - ఇంద్రపాలనగరం
• విష్ణుకుండినుల తొలిరాజులలో అగ్రగణ్యుడు, గొప్పవాడు.
• తుమ్మలగూడెం శాసనం, ఇంద్రపాలనగర శాసనం ను వేయించినది - మొదటి గోవిందవర్మ
• మొదటి గోవిందవర్మ వేసిన ఇంద్రపాలనగర తామ్రశాసనం తెలంగాణలో లభించిన తొలి సంస్కృత శాసనం
• మొదటి గోవిందవర్మ హైదరాబాద్ చైతన్యపురి లో మూసినది ఒడ్డున తన పేరుమీద గోవిందవిహారాన్ని నిర్మించి, చైతన్యపురి శాసనం (ప్రాకృతం) వేయించాడు.
• తెలంగాణలో తొలి ప్రాకృత శాసనం - చైతన్యపురి శాసనం
• విష్ణుకుండినుల వంశంలో బౌద్ధమతాన్ని ఆదరించిన ఏకైక చక్రవర్తి - మొదటి గోవిందవర్మ
• ఇతని భార్య పరమభట్టారిక బౌద్ధ భిక్షువులకోసం ఇంద్రపాల నగరంలో మహవిహారాన్ని నిర్మించింది.
• గోవిందవర్మ ఈ విహారానికి పేణ్కపర (ఎన్మదల) గ్రామంను దానం చేసాడు.
• పేణ్కపర గ్రామం ప్రస్తుతం యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో కలదు.
• తరువాతి కాలంలో రాజ్యానికి వచ్చిన విక్రయేంద్ర భట్టారక వర్మ పరమబట్టారిక నిర్మించిన విహారానికి ఇరుందెర అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
• గోవిందవర్మ పల్లవులను ఓడించి గుండ్లకమ్మ నది వరకు తన రాజ్యాన్ని విస్తరింపచేసాడు.
• ఇతను 'స్వనయ భుజబలోత్సాహ ప్రభావానురాగ వ్యాప్తి స్వరాజ్యేన' అని చెప్పుకున్నాడు.
రెండవ మాధవవర్మ (క్రీ.శ.435-470)
• ఇతను విష్ణుకుండినుల రాజులందరిలో గొప్పవాడు.
• ఇతని కాలాన్ని విష్ణుకుండినుల చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు.
• రాజధానిని ఇంద్రపాల నగరం నుండి దెందులూరికి మార్చాడు.
• శాసనాలు ఇతనిని 'బలసత్వ ధైర్యవిద్య వినయ సంపన్నుడు' గా పేర్కొన్నాయి.
• ఇతను ప్రక్కరాజ్యాలపై దండయాత్రలు చేసి విష్ణుకుండినుల సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు.
• ఇతను శాలంకాయనులు, ఆనందగోత్రికులను ఓడించి వేంగీ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
• పల్లవులను, వాకటకులను కూడా ఓడించాడు.
• ఇతని విజయాలను పురస్కరించుకొని ఇతను 11 అశ్వమేధయాగాలు, పురుషమేధం, 1000 క్రతువులు నిర్వహించాడు.
• ఇతడు దేశంలోనే మొదటి సారిగా నరమేదయాగం/ పురుషమేదయాగం చేసాడు.
• ఆంధ్రుల చరిత్రలో నరమేధయాగం (యాగంలో నరబలి) చేసిన ఒకే ఒక రాజవంశం - విష్ణుకుండినులు
• ఇతడు వైదికమతాన్ని ప్రోత్సహించాడు.
• 2వ మాధవవర్మ పాలనాకాలంలోనే మొఘల్ రాజపురం, ఉండవల్లి గుహలు అంతకు ముందున్న బౌద్ధ చిహ్నాలను కోల్పోయి హిందూ దేవాలయాల నివాసాలుగా మారాయి.
• ఇతను ఉండవల్లిలో బుద్ధుడి విగ్రహాన్ని పగలగొట్టించి,దాని స్థానంలో శయనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని చెక్కించాడు. ఇదే నేడు అనంతపద్మనాభస్వామి ఆలయం
• ఇతను ఉండవల్లి గుహలలో పూర్ణకుంభాన్ని చెక్కించాడు.
• రెండవ మాధవవర్మ తెలంగాణలో నిర్మించిన ప్రముఖ దేవాలయాలు :
• కీసర - రామలింగేశ్వర ఆలయం
• చెరువుగట్టు (నల్గొండ) - జడల రామలింగేశ్వరాలయం
• షాద్ నగర్ (రంగారెడ్డి) - రామలింగేశ్వర ఆలయం
• ఇంద్రపాలనగరం - అమరేశ్వరాలయం, మల్లిఖార్జునాలయం , రామేశ్వరాలయం
• పులిగిళ్ళ (వలిగొండ) - రామలింగేశ్వరాలయం
• రెండవ మాధవ వర్మ బిరుదులు :
• జనాశ్రయ
• త్రివరనగర భవనగత సుందరీ హృదయ నందన
• ప్రార్దిక్షిణాపదాంభోనిధిరేవా సరిత్సలిలవలయ.
• రెండవ మాధవవర్మ అనేక యుద్ధాలు చేసి విజయం సాధించి ఒకొక్క విజయానికి గుర్తుగా కీసరగుట్ట పైన ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠచేసాడు.
• ఈయన విజయం సాధించిన ప్రతి చోట రామలింగేశ్వరాలయం కట్టించాడు.
• మహారాష్ట్రలోని ఖానాపూర్ (సతార జిల్లా)లో రెండవ మాధవవర్మకు చెందిన రాగిశాసనం లభించింది.
• ఇతను వేయించిన శాసనాలు:
• ఈపురు శాసనం -1
• ఖానాపూర్ శాసనం
• వేల్పూరు శాసనం
• వేల్పూరు శాసనం ప్రకారం ఇతను గణపతి (దంతముఖ స్వామి) ప్రతిష్ట చేసినట్లు తెలుస్తుంది.
• జనాశ్రయ ఛందోవిచ్చిత్తి అనే గ్రంథాన్ని రెండో మాధవవర్మ రచించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. (దీనిని గుణస్వామి రాసాడని కొందరి అభిప్రాయం)
• జనాశ్రయ ఛంధోవిచ్చిత్తి తెలంగాణలో రచించబడ్డ మొట్ట మొదటి సంస్కృత లక్షణ గ్రంథం.
విక్రయేంద్రవర్మ:
• ఇంద్రపాలనగర శాసనం ప్రకారం ఇతని బిరుదులు
పరమసొగతస్య (బుద్ధుడి అంతటి జ్ఞాని)
మహాకవి
• ఇతనికి విష్ణుకుండిన, వాకటక వంశద్వయాలంకార జన్మ అనే నామం కూడా ఉంది.
3వ మాధవవర్మ
ఇతని బిరుదులు :
• త్రికూట మలయాధిపతి • అలిసిత వివిధదివ్య
• ఈయన కందార వంశాన్ని (ఆనంద గోత్రిక) పూర్తిగా నిర్మూలించి త్రికూట మలయాధిపతి బిరుదును ధరించాడు.
విక్రయేంద్ర భట్టారక వర్మ (రెండవ విక్రయేంద్రవర్మ)
ఇతని బిరుదులు :
• సకల భువన రక్షాభరణైకాశ్రయ
• ఉత్తమాశ్రయుడు
ఇతడు వేయించిన శాసనాలు:
తుమ్మలగూడెం శాసనం-2
తుండి శాసనం
చిక్కుళ్ళ తామ్రశాసనం
• బ్రాహ్మణులకు 'తుండి' అనే గ్రామాన్ని దానం చేశాడు.
నాలుగవ మాధవ వర్మ:
ఇతని శాసనాలు: పొలమూరు -2 • ఈపూరు -2
ఇంద్రభట్టారక వర్మ
• ఇతను కీసర సమీపంలో ఘటకేశ్వరం అనే ఘటికాస్థానాన్ని నెలకొల్పాడు.
• ఇతని కాలంలో ఘటికలు అని పిలువబడే వైదిక విద్యాలయాలు స్థాపించబడ్డాయి. వాటిల్లో వేదవిద్యలను భోదించేవారు
మంచ భట్టారకవర్మ
• విష్ణుకుండిన రాజులలో చివరివాడు - మంచభట్టారకుడు .
• చివరి విష్ణుకుండిన రాజు మంచన భట్టారకుణ్ణి, పృధ్వీ మూలరాజు ఓడించి రాజ్యాన్ని ఆక్రమించినట్లు తండివాడ శాసనం తెలుపుతుంది.
విష్ణుకుండినుల పరిపాలన - సంస్కృతి Administration and Culture of Vishnukundins
• విష్ణుకుండినులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా, విషయాలుగా విభజించారు.
• విష్ణుకుండినుల కాలంలో
హస్తికోశ - గజదళాధిపతి
వీరకోశ - పదాతిదళాదిపతి
ఇతర ఉద్యోగులు
• రజ్జుక - భూములను తాడుతో కొలిచి ఆయకట్టును నిర్ణయించేవాడు.
• ఫలదారుడు - పండిన పంటలో రాజ్యభాగాన్ని నిర్ణయించే అధికారి
• సెట్టి - ప్రభుత్వానికి చెందాల్సిన ధాన్యాన్ని కొలిచేవాడు.
• అక్షపటలాధికృతుడు - ప్రభుత్వ పత్రాలు భద్రపరిచేవాడు.
ఆర్థిక పరిస్థితులు - వాణిజ్యం: Economic conditions and Trade in Vishnukundins
• విష్ణుకుండినుల కాలంలో గ్రామాలలో స్వయం సమృద్ధియైన న్యాయపాలన ఆర్థికవ్యవస్థ ఉండేది.
• వీరు వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు.
• వీరి కాలంలో తూర్పు ఆసియాదేశాలతో మరియు రోమ్, గ్రీస్ దేశాలతో విదేశీ వ్యాపారం జరిగింది.
• రెండో మాధవ వర్మకు త్రిసముద్రాధిపతి అనే బిరుదు ఉండటం వారి విదేశీ వాణిజ్య ప్రాముఖ్యాన్ని సూచిస్తున్నాయి.
నాణేలు
• విష్ణుకుండినులు రాగి, ఇనుము లోహములతో నాణేలను ముద్రించేవారు.
• వీరి నాణెములపై శ్రీపర్వత అనే అక్షరాలు, శంఖం, సింహం గుర్తులను ముద్రించేవారు.
• విష్ణుకుండినుల రాజ్యంలో గవ్వలు కూడా ద్రవ్యంగా చెలామణి అయ్యాయని చైనా యాత్రికుడు ఫాహియాన్ పేర్కొన్నాడు.
• మరో చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ ప్రకారం శ్రీపర్వతం మీద బంగారంతో చేసిన నిలువెత్తు బుద్ధ బంగారు విగ్రహాలు ఉండేవని పేర్కొన్నాడు. అయితే ఈ విగ్రహాలు మనకు అమరావతిలో లభించాయి.
• దీనిని బట్టి వీరికాలంలో కంసాలి వృత్తిపని వారు మంచి నైపుణ్యం కలవారని తెలుస్తుంది. కీసరగుట్టపై దొరికిన ఒక నశం డబ్బి (పోత ఇనుముతో మామిడి పిందె ఆకారంలో చేసినది - 7 సెం.మీ) ఇందుకు మరో నిదర్శనం.
• ఆలంపురం దగ్గరి కూడలి సంగమేశ్వరంలో జరిపిన త్రవ్వకాలలో రోమన్ చక్రవర్తి కాన్ స్టాంటిన్ (క్రీ.శ 306 - 337) కు చెందిన ఒక బంగారు నాణెం దొరికింది.
సాంఘిక పరిస్థితులు: Social Conditions in Vishnukundins
• వీరి కాలం నాటికి వర్ణవ్యవస్థ పూర్తిగా బలపడింది.
• విష్ణుకుండినులు దానమానాదులచే అనురక్తమగు వర్ణాశ్రమం స్వజన పరిజనులైనవారు అని వారి శాసనాలలో ఉంది.
• మాధవ వర్మ తన తల్లిదండ్రుల పాదాలను నిరంతరం సేవించేవాడట. దీనిని బట్టి ఆనాటి ప్రజలు కూడా తల్లిదండ్రులు, పెద్దలపట్ల గౌరవంగా నడుచుకునే వారణ చెప్పవచ్చు.
న్యాయ పాలన Rule of Law in Vishnukundins
• విష్ణుకుండినులు న్యాయపాలనకు పేరుగాంచారు
• రెండవ మాధవవర్మ దివ్యాలు అనే న్యాయవిధులను కనిపెట్టాడు.
• చింతకాయలు అమ్ముకొనే ఒక స్త్రీ కొడుకు ఏమరుపాటున తన రథాన్ని పోనిచ్చి చంపిన తన కుమారునికి మాధవవర్మ ఉరిశిక్ష విధించాడు.
సాహిత్యం - మతం Literature and Religion of Vishnukundins
• సంస్కృతం ను అధికార భాషగా చేసుకొని పరిపాలించిన మొదటి రాజవంశం - విష్ణుకుండినులు
• అయితే విక్రమేంద్ర భట్టారకవర్మ వేయించిన చిక్కుళ్ళ తామ్రశాసనంలో విజయరాజ్య సంవత్సరంబుల్” అనే మొదటి తెలుగు వాక్యం లిఖించబడింది.
• కీసరగుట్టపై ఉన్న ఒక గుండుకు 'తొలుచువాండ్లు' అనే అచ్చతెలుగు పదం చెక్కబడింది.
• ఇంద్రభట్టారక వర్మ బిరుదు - ఘటికావస్త పుణ్యసంచయ
• రెండవ మాధవ వర్మ బిరుదు - విద్య ద్విజగుడు విస్తావృద్ధ తపస్వి జనాశ్రచయ
• గోవింధ వర్మ - షడభిజ్ఞ అని ప్రఖ్యాతి చెందారు.
• పై బిరుదులను బట్టి విష్ణుకుండిన రాజులందరు స్వయంగా కవిపండితులని, కవి పండిత పోషకులని తెలుస్తుంది.
మత పరిస్తితులు
వైదికమతం
• విష్ణుకుండినులు వైదిక మతాభిమానులు
• వీరి కులదైవం - శ్రీ పర్వత స్వామి
• వీరి పేర్ల ద్వారా వీరు వైదిక మతాభిమానులని అర్ధం అవుతుంది.
• దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా హిందూ గుహాలయాలను విష్ణుకుండినులు నిర్మించారు. హిందూ దేవాలయాలను మాత్రం మొదట ఇక్ష్వాకులు నిర్మించారు.
• శ్రీపర్వత పాదంలోని ఉమా మహేశ్వర దేవాలయం (ఆమ్రాబాద్) వీరికాలంలో శ్రీశైల దేవస్థాన ఉత్తర ద్వారంగా పేరుపొందింది.
• వీరు వైదిక మతస్థులు అయినప్పటికి ఇతర మతస్థులను ద్వేషించలేదు.
జైనమతం:
• విష్ణుకుండినుల కాలంలో శ్రీశైలం తొలుత జైన క్షేత్రంగా ఉండి, తరువాతి కాలంలో గొప్ప శైవక్షేత్రంగా మారింది.
• ఈ విషయాన్ని జైనకవి న్యాయ సేనుడు కన్నడంలో రచించిన ' ధర్మామృతం' అనే గ్రంథంలో వివరించాడు.
బౌద్ధమతం:
• జైనమతంలో పుట్టిన కాపాలిక తెగ వల్ల జైనమతం విష్ణుకుండినుల కాలంలోనే క్షీణదశకు చేరుకుంది.
విష్ణుకుండినుల కాలానికి చెందిన ప్రముఖ బౌద్దపండితుడు - దిగ్నాగుడు
• దిగ్నాగుడి ప్రసిద్ధ సంస్కృత గ్రంథం - ప్రమాణ సముచ్చయం
• దిగ్నాగుడు బౌద్ధంలో యోగాకారవాదం (యోగాచారపంథా) ను బోధించాడు.
• తెలుగు ప్రాంతానికి చెందిన బౌద్ధ మహాపండితులలో దిగ్నాగుడు చివరివాడు.
• ఇతను వేంగి ప్రాంతంలో సాంఖ్యాకారికా రచయిత అయిన ఈశ్వర కృష్ణునితో వాగ్వాదాలు జరిపాడు.
• విష్ణుకుండినుల కాలానికి చెందిన దుగ్గిపల్లి దుగ్గన వ్రాసిన గ్రంథం - నాచికేతోపాఖ్యానం
• విష్ణుకుండినుల కాలం నాటి గొప్ప బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ
• వీరికాలంలో ఉద్దేశిక స్థూపం - లింగాలమెట్టు
• బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు
• క్రీ.శ 5వ శతాబ్దం చివరి నాటికి అమరావతి, నాగార్జున కొండ ప్రాంతాలలో బౌద్ధమతంలో మరో శాఖ అయిన వజ్రయానం ప్రవేశించింది.
• వజ్రయాన శాఖలోని బౌద్ధ సంఘంలోకి స్త్రీలు, మద్యమాంసాలు, మాయమంత్రాలు ప్రవేశించి క్రమక్రమంగా పవిత్రతను కోల్పోయింది.
• ఈ వజ్రయాన శాఖపల్ల బౌద్దం క్రమంగా క్షీణించి ప్రజాభిమానాన్ని కోల్పోయింది.
• తదుపరి బ్రాహ్మణులు, బుద్ధుడిని విష్ణువు యొక్క 9వ అవతారంగా చిత్రీకరించి బౌద్ధక్షేత్రాలను, వైష్ణవ క్షేత్రాలుగా మార్చారు.
వాస్తు శిల్పకళ Architecture in Vishnukundins
• విష్ణుకుండినులు నిర్మించిన ఆలయాలలో ప్రస్తుతం ఉన్న గర్భగృహం, ముఖమండపం, అర్థమండపంలు ఉండటం విశేషం.
• భువనగిరి కోటను కూడా మొదటి విష్ణుకుండినులే కట్టించినట్లు తెలిపే విష్ణుకుండినుల రాజచిహ్నం లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోట గోడలమీద కనిపిస్తాయి.
• విష్ణుకుండినుల కాలం నాటి బౌద్ధస్థూపాలు ఫణిగిరి, నేలకొండపల్లిలలో బయల్పడ్డాయి.
• నేలకొండపల్లిలో గల బౌద్ధస్థూపాన్ని విరాట్ స్థూపం అని పిలిచేవారు. రాను రాను విరాటరాజు గద్దెగా పిలువబడుతుంది.
• పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం ప్రక్కన ఉన్న ఎల్.మడుగుపై ఉన్న గుహలు, గౌరీగుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మంటప స్తంభాల పై విష్ణుకుండికాలపు చైత్యాలంకరణలు (బౌద్ధ ఆరామాలు) కనిపిస్తాయి.
• ఎల్.మడుగు కింది వైపున కోమటి గుహలు సమకాలీన జైన మతస్థులకు ఆరామాలుగా మనుగడలో ఉన్నట్లు తెలుస్తుంది.
• విష్ణుకుండినుల జన్మస్థానమైన అమరావతికి సమీపంలో ఉన్న ఉమామహేశ్వరం, సల్లేశ్వరం గుహలు, ఆలంపురం శైవ-శక్తి ఆలయాలుగా వెలుగొందాయి.
• ఉమామహేశ్వరం శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారా క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది,
• ఉమామహేశ్వరంలో పల్లవులు చెక్కించిన శివలింగం, విష్ణుకుండినులు చేయించిన నగారా భేరి ఇప్పటికీ ఉన్నాయి.
• సల్లేశ్వరంలో ఉన్న రెండు గుహాలయాల్లో ఒక ఆలయం గోడకు 'విశ్వేశ కక్కలస' అని రాసి ఉన్న బ్రాహ్మీ శాసనాన్ని డా॥ ద్యావనపల్లి సత్యనారాయణ గుర్తించారు.
విష్ణుకుండినుల కాలంలోని గుహలు
మొగల్రాజపురం గుహలు (కృష్ణాజిల్లా)
• మొగల్రాజపురంలో మొత్తం 5 గుహలు కలవు
• 5వ గుహ అతి పెద్దది. దీనినే శివతాండవ గుహ అంటారు. ఈ గుహలో అర్థనారీశ్వర ప్రతిమ కలదు.
• ఈ గుహలలో ఉన్న విగ్రహాలు.
అష్టభుజ నారాయణస్వామి త్రివిక్రమావతార మూర్తి
ఉండవల్లి గుహలు (కృష్ణాజిల్లా )
• ఇక్కడ ఉన్న 3 గుహలలో మధ్యస్థ గుహ పెద్దది
* ఈ గుహలోనే అనంతపద్మనాభస్వామి ఆలయం కలదు
• ఈ గుహపై ఉత్పత్తి పిడుగు అనే లేఖనం ఉంటుంది`
• ఈ గుహపైనే పూర్ణకుంభం చెక్కారు.
అక్కన్న -మాదన్న గుహలు
• విజయవాడ కనకదుర్గ ఆలయ సమీపంలో గల ఈ గుహలను విష్ణుకుండినులే తొలిపించారు.
0 Comments